ఇలా చేస్తే ఒక్కరోజులో పిల్లల నుండి పెద్దల వరకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్ తగ్గిపోతుంది

Simple home remedy for cough and cold : విపరీతమైన చలి, మంచు కారణంగా దగ్గు, జలుబు తొందరగా వచ్చేస్తున్నాయి. రావటం అయితే తొందరగా వచ్చేస్తాయి కానీ తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. దగ్గు జలుబు వంటివి ప్రారంభంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.

దీనికోసం ముందుగా పది తులసి ఆకులు తీసుకుని మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసంలో నాలుగు మిరియాలను మెత్తని పౌడర్ గా చేసి కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె కలపాలి. మిరియాల పొడి., తులసి రసం, తేనె మూడు బాగా కలిసేలా బాగా కలపాలి. దీనిని ఉదయం సమయంలో ఒకసారి సాయంత్రం సమయంలో ఒకసారి తీసుకోవాలి.

ఇలా తీసుకుంటే రెండు రోజుల్లోనే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి తగ్గిపోతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతుంది. తులసి ఊపిరితిత్తుల్లో చేరిన కఫాన్ని కూడా కరిగిస్తుంది. మిరియాలు శరీరంలో వేడిని పెంచి చలి కారణంగా ఏర్పడే సమస్యలను తగ్గిస్తుంది.

తేనె శ్వాసకోశ వ్యాధులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమంను పెద్ద వారైతే రెండు స్పూన్లు, చిన్నపిల్లలైతే ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. తులసి ఆకులు,మిరియాలు, తేనె ఇంటిలో అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.