ఈ సమస్యలు ఉన్నవారు కాలీఫ్లవర్ తింటే ఏమి అవుతుందో తెలుసా?
cauliflower : తెల్లని రంగులో ఉండే కాలీఫ్లవర్ పువ్వు ఈ చలి కాలంలో చాలా విరివిగా లభ్యం అవుతుంది. కాలీఫ్లవర్ లో కాల్షియం., పాస్పరస్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. .కాలీఫ్లవర్ ను వారంలో రెండు సార్లు తీసుకుంటే జీర్ణ క్రియను మెరుగుపరిచి గ్యాస్, ఎసిడిటీకి కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
దంత సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యలు లేకుండా చేస్తుంది. కాలిఫ్లవర్ రసం పరగడుపున తాగితే క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
ఎముకలు కీళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా కాలీఫ్లవర్ ను తినవచ్చు. చలికాలంలో లో కాలిఫ్లవర్ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం అందించినట్లు అవుతుంది. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తీసుకోకపోవటం ఉత్తమం. దీన్ని తీసుకోవడం వల్ల టి3,టి4 హార్మోన్లు పెరుగుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. కాలీఫ్లవర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.