ఈ కూరగాయలను పచ్చిగా తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Raw vegetables : సాధారణంగా కూరగాయలు తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కొన్ని కూరగాయలను ఉడికించుకొని తింటూ ఉంటాం, కొన్ని కూరగాయలను పచ్చిగానే తింటుంటాం. అయితే కొన్ని కూరగాయలను పచ్చిగా అస్సలు తినకూడదు, అలా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.

వంకాయను పచ్చిగా అసలు తినకూడదు. ఎందుకంటే వంకాయలో సొలనైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇవి శరీరంలో విషాలను విడుదల చేస్తాయి. వంకాయలను ఉడికించేటప్పుడు.సొలనైన్ అనే సమ్మేళనం ప్రభావం తగ్గుతుంది. కాలీఫ్లవర్ ను పచ్చిగా తినకూడదు. ఉడికించుకుని మాత్రమే తినాలి.ఎందుకంటే కాలీఫ్లవర్ ఉడికిస్తే వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి. పచ్చిగా తిన్నప్పుడు జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మొలకెత్తిన గింజలను తినటం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. వీటిని ఉడికించి తింటే మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే రసాయనాలు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేలా ప్రేరేపిస్తాయి.మొలకెత్తిన గింజలను పచ్చిగా తిన్నప్పుడు గ్యాస్ వంటి సమస్యలు వస్తే తినడం మానేయాలి. అప్పుడు. ఉడికించి మాత్రమే తీసుకోవాలి.

మనలో చాలామంది పుట్టగొడుగులను పచ్చిగా తింటూ ఉంటారు. వాటిలో ఉండే విషపదార్థాలు ప్రమాదకర పరిస్థితులను కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ఉడికించి మాత్రమే తినాలి. బంగాళదుంపను కూడా తప్పనిసరిగా ఉడికించుకొని మాత్రమే తినాలి. ఎందుకంటే పచ్చిగా తింటే వాటిలో ఉండే పిండి పదార్థాలు త్వరగా జీర్ణం కాక గ్యాస్., ఎసిడిటీ వంటి జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన కూరగాయలను కచ్చితంగా ఉడికించుకొని మాత్రమే తినాలి.