Healthhealth tips in telugu

ఉదయం పరగడుపున ఈ జ్యూస్ లు తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?

Fruit Juices : ఉదయం సమయంలో తీసుకునే ఆహారం రోజుల్లో చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి భోజనం చేసిన తర్వాత దాదాపుగా 8 నుంచి 10 గంటల వరకు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోము. అందువల్ల తర్వాత తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఉదయం సమయంలో పరగడుపున వేడి నీళ్లు లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారు. .
lemon juice side effects in telugu
ఉదయం పరగడుపున కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ లు అస్సలు తీసుకోకూడదు. పండ్ల రసాలు మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ పోషకాలను అందిస్తాయి. అయితే వాటిని తీసుకోవడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఉదయం తీసుకోకూడదు. ముఖ్యంగా. సిట్రస్ ఫ్రూట్స్,సీజనల్ ఫ్రూట్స్ తో తయారుచేసిన జ్యూస్ లను ఉదయం సమయంలో తీసుకోకూడదు.

అంటే నిమ్మకాయ, ద్రాక్ష,నారింజ వంటి పండ్ల రసాలను ఉదయం పరగడుపున తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా సిట్రస్ ఉంటుంది. అందువల్ల ఉదయం పరగడపున కాకుండా బ్రేక్ ఫాస్ట్ సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ తీసుకుంటే సరిపోతుంది.

ఉదయం పరగడుపున జ్యూస్ లు తాగేవాళ్లు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.