శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే…ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

Cholesterol : మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అనేవి రెండు తయారవుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటేనే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాంటప్పుడు రక్తనాళాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్త ప్రవాహం బాగా సాగుతుంది.అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వస్తుంటాయి.
Ginger benefits in telugu
చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చు. రాత్రి సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో.అరస్పూన్ అతి మధురం పొడిని కలిపి తీసుకుంటే క్రమంగా చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు, కొలెస్ట్రాల్ అన్ని కరిగిపోతాయి

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ప్రతిరోజు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి. ఈ విధంగా తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా .కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించటానికి జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు పెరుగులో పావు స్పూన్ జీలకర్ర పొడి కలుపుకుని తినవచ్చు. లేదా .జీలకర్ర కషాయం తయారు చేసుకుని తాగవచ్చు.

ఉసిరి జ్యూస్ కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రోజుకి. 30Ml మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.