Healthhealth tips in telugu

1 ముక్క-నరాల బలహీనత,వణుకు,కండరాల నొప్పులు,రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చేస్తుంది

Nalla Thumma Chettu Beradu : ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను ఉపయోగిస్తారు. ఆ మొక్కలు మనకు కనిపిస్తున్న వాటి ప్రయోజనాలు తెలియక ఏవో పిచ్చిమొక్కలుగా భావిస్తాము. వాటిలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటిలో నల్ల తుమ్మ మొక్క ఒకటి. దీని బెరడులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
nalla tumma beradu
నల్ల తుమ్మ బెరడు మనకు మార్కెట్ లో లభ్యం అవుతుంది. దీనిని పొడిగా చేసుకొని కషాయం తయారుచేసుకొని తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నరాల బలహీనత,వణుకు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తనాళాలను మృదువుగా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలోను,ప్రేగుల్లోనూ ఇన్ ఫెక్షన్ లేకుండా చేస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ మరియు వ్యాయామం చేసేవారిలో వచ్చే కండరాల నొప్పులను తగ్గిస్తుంది. కండరాల తిమ్మిరిని తగ్గించి కండరాలు త్వరగా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారిలో వణుకు, నడక, సమతుల్యత మరియు సమన్వయంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.