Beauty Tips

వేసవిలో మెరిసే చర్మం కోసం Fruit Packs

చర్మంలో విషాలను బయటకు పంపి ప్రకాశవంతంగా మార్చటానికి పండ్లు సహాయపడతాయి. రసాయనక చికిత్సలు కాకుండా సీజన్ కి తగ్గట్టుగా దొరికే పండ్లతో చర్మాన్ని మెరిపించవచ్చు. ఆ పండ్ల గుజ్జులో కొన్ని పదార్దాలను కలిపి ఉపయోగిస్తే చాలు. అవి చర్మాన్ని మెరిపిస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Banana,Peel
1.అరటిపండు – పోషణ
ఇది పొడి చర్మం వారికీ చాలా బాగా సెట్ అవుతుంది. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, దానిలో పాలు కలిపి మందపాటి పేస్ట్ గా చేయాలి. దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసం,అరస్పూన్ కాలామైన్ పౌడర్ కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. ఆరెంజ్ – శక్తి
ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే లాభాన్ని చర్మానికి ఇస్తుంది. ఇది చర్మం కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక స్పూన్ తాజా పాల మీగడ,ఒక స్పూన్ ముల్టానా మట్టి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాల మీగడ చర్మంలో పొడిదనంను తగ్గిస్తుంది.

3. ఆపిల్ – మెరుపు
అలసిన చర్మానికి మెరుపు రావాలంటే ఆపిల్ ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. ఆపిల్ ని మెత్తని పేస్ట్ గా చేసి దానికి పచ్చి పాలు, పాల పొడి,ముల్టానా మట్టి వేసి బాగా కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా మరియు ప్రకాశవంతంగా ఉంచటమే కాకుండా సహజ pH సంతులన పునరుద్ధరణకు సహాయపడుతుంది.

4. స్ట్రాబెర్రీ – మేజిక్
స్ట్రాబెర్రీ గుజ్జులో మీగడ వేసి బాగా కలపాలి. దీనికి చైనా పౌడర్ ని కలిపి ముఖానికి పలుచగా రాయాలి. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా ఉంచటమే కాకుండా, లోపల నుండి పోషణను ఇస్తుంది.