Healthhealth tips in telugu

ఫుడ్ పాయిజన్ సమస్యలను తగ్గించే ఇంటి చిట్కాలు..

Food poisoning Home Remedies : సాధారణంగా ఎక్కువగా నిల్వ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు లేక రకరకాల ఆహారం తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజన్ సమస్య ఎదురవుతుంది. శుభ్రంగా లేని ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంటుంది. దీని వల్ల కడుపులో మంట వస్తుంటుంది. వాంతులు, మైకం, కడుపు, వికారం ఇలాంటవన్నీ ఎదురవుతాయి.
Tulasi Health benefits in telugu
ఫుడ్ పాయిజనింగ్ అయితే.. సహజంగానే తగ్గాలి. లేకపోతే శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ సమస్య ఎదుర్కొంటాం. కాబట్టి ఆ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీటితో పాటు పండ్ల రసాలను కూడా తీసుకోవాలి. సమస్య ఉన్నప్పుడు తులసి ఆకుల రసాన్ని ఓ కప్పు నీటిలో టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని అందులో కొద్దిగా తేనెని కలపండి. ఇలా తయారైన డ్రింక్‌ని రోజుకి కొద్దిసార్లు తీసుకుంటూ ఉండాలి.

ఇష్టం ఉంటే దీనికి కాస్తా కొత్తిమీర రసాన్ని కూడా కలపొచ్చు.ఇలా తాగడం వల్ల కడుపునొప్పులు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ డ్రింక్‌ని ట్రై చేయొచ్చు.అదే విధంగా టేబుల్ స్పూన్ల పెరుగు, కాసింత మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు కలపండి…. దీన్ని రోజుకి 3 నుంచి 4 సార్లు తింటే సమస్యని తగ్గించుకోవచ్చు.వెల్లుల్లిని కూడా వాడొచ్చు.

వెల్లుల్లిలోనూ బలమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి తగ్గుతుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.ఇందుకోసం ముందుగా వెల్లుల్లిని రసంలా చేయండి.. ఈ రసంని సోయాబీన్ నూనెతో కలిపి తిన్న తర్వాత కడుపుపై వేసి మసాజ్ చేస్తుండాలి. దీని వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.