ఈ జ్యూస్ రక్తాన్ని శుద్ది చేయటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ ని నియంత్రిస్తుంది

Bael Juice Health benefits : మారేడు చెట్టుకు ఆయుర్వేదంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీని ఔషధ మొక్కగా ఉపయోగిస్తారు. దీని ఆకులను బిల్వ పత్రాలు అంటారు. వీటితో శివునికి పూజ చేస్తారు. అలాగే మారేడు పండుతో షర్బత్ చేసుకొని తాగితే వేసవి బాధలన్నీ తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెప్పుతున్నారు. మారేడు పండుతో జ్యూస్ చేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Maredu Pandu
మారేడు పండులో ప్రొటీన్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు విటమిన్ బి-కాంప్లెక్స్,పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, రాగి, ఇనుము,ఫైబర్స్ సమృద్దిగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు,ఫైబర్ ఉండుట వలన గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి వాటిని తగ్గించటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. లిపిడ్ ప్రొఫైల్‌లు, ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రించే శక్తి మారేడు పండు జ్యూస్‌కు ఉంది. ఇది కార్డియో-ప్రొటెక్టివ్ ఫ్రూట్, ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో మారేడు పండు ప్యాంక్రియాస్‌ను ప్రేరేపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

దాంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మారేడు పండును శుభ్రంగా కడిగి పై తొక్క తీసేసి లోపల గుజ్జును మిక్సీ జార్ లో వేసి సరిపడా నీటిని పోసి మిక్సీ చేసి జ్యూస్ ని వడకట్టాలి. ఈ జ్యూస్ లో మిరియాల పొడి,నిమ్మరసం,ఉప్పు వంటివి వేసుకొని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.