నరాల బలహీనత, కండరాల బలహీనతకు చెక్ పెట్టాలంటే ఈ పండు తినండి…అలా తింటేనే…!

Guava for weight loss :నరాల బలహీనత ఏర్పడటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి.నరాలు పట్టుత్వం కోల్పోయి ఏ పని చేయలేరు నరాలు బలహీనంగా అయినప్పుడు శరీరం అంతా శక్తి విహీనంగా మారుతుంది. అలాగే ఏ పని చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు .మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఇలాంటి నరాల బలహీనతకు చెక్ పెట్టాలంటే జామ పండు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
jamakaya
జామ పండు అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకూ చాలా ఇష్టంగా తింటారు. రోజుకి ఒక జామకాయ లేదా జామకాయ జ్యూస్ తాగితే వాటిలో ఉండే పోష కాలు నరాల బలహీనత, కండరాల బలహీనత రెండింటిని దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నరాల బలహీనత ఉన్నవారు రోజుకు ఒక జామ పండు తింటే మంచిది. అలాగే జామ పండు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

డయాబెటిస్ ఉన్నవారు దోరగా ఉన్న జామ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి. నిమ్మ కంటే జామ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. విటమిన్ సి కావాలి అంటే నిమ్మకాయల వెంట పరిగెడుతూ ఉంటారు. కానీ జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది.

అంతే కాకుండా బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. చాలామంది పచ్చిగా ఉన్న జామకాయలు తింటూ ఉంటారు. అలా తినకూడదు దోరగా ఉన్న జామ కాయలు లేదా బాగా పండిన జామ కాయలు మాత్రమే తినాలి. పచ్చి జామకాయ తింటే వాటిలో ఉండే ఫాస్పరస్, ఆక్సాలిక్ ఆమ్లం కడుపునొప్పి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి పచ్చి జామకాయ తినడం ఆరోగ్యానికి ప్రమాదమే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.