డయాబెటిస్ ఉన్నవారు బత్తాయి పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Mosambi for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బత్తాయి పండును ఎలా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. బత్తాయి పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
Diabetes In Telugu
బత్తాయిలో అస్పిరిడిన్, నారింజిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. నారింజిన్ అనేది లివర్ లో మాత్రమే కాకుండా శరీరం మొత్తం కణజాలల తలుపులు తెరుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ కణజాలాల్లోకి వెళ్ళుతుంది. అలాగే అస్పిరిడిన్ అనేది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు బత్తాయి పండును జ్యూస్ రూపంలో కాకుండా తోనలను నమిలి తింటే మంచిది. దీని వలన ఫైబర్ సమృద్దిగా లభించి రక్తంలోకి చక్కెర వెళ్లకుండా నిరోదిస్తుంది. బత్తాయి పండును ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అయితే పరగడుపున తీసుకుంటే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. ఆకుపచ్చని రంగులో ఉన్న బత్తాయి కన్నా పసుపు రంగులో ఉన్న బత్తాయి పండు మంచిది.

బత్తాయి పండులో ఉండే పాలీఫెనాల్స్ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బత్తాయి పండులో బీటా కెరోటిన్, కాల్షియం, ఫోలేట్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ కారణంగా వచ్చే అనేక రకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.