1 గ్లాస్ తాగితే చాలు కాల్షియం లోపం ఉండదు…మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు జన్మలో ఉండవు

Remove Joint Pains And Boday Pains : ఈ మధ్య కాలంలో చాలా మంది calcium లోపంతో బాధపడుతున్నారు. ఆ లోపం కారణంగా మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవాలన్నా, సమస్యలు రాకుండా ఉండాలన్నా ఇప్పుడు చెప్పే పాలను తాగితే సరిపోతుంది.

ముప్పావు కప్పు నల్లనువ్వులు, అరకప్పు సగ్గుబియ్యం,అరకప్పు బార్లీ, ఒక కప్పు నల్లమినపప్పు తీసుకోవాలి. వీటిని పొయ్యి మీద పాన్ పెట్టి విడివిడిగా వెగించి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక స్పూన్ శొంఠి పొడి, ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ పొడి దాదాపుగా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక స్పూన్ పొడిని చిన్న బౌల్ లో వేసి నీటిని పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక నీటిని కలిపిన పొడిని వేసి 5 నిమిషాలు కలుపుతూ మరిగించాలి.

బాగా మరిగిన ఈ పాలను గ్లాసు లోకి పోయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఈ పాలను పది రోజుల పాటు తాగితే కాల్షియం లోపం తగ్గి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి. ఒక్క సారి ఈ పొడిని తయారుచేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడవచ్చు.
protein Laddu
ఈ పొడిలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.అంతేకాకుండా వీటిలో calcium సమృద్దిగా ఉంటుంది. ఈ పాలను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు తాగవచ్చు. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ పొడిని తయారుచేసుకొని వాడటానికి ప్రయత్నం చేయండి. బెల్లం ఆర్గానిక్ బెల్లం అయితే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.