10 రోజులు ఇలా చేసి పాలు తాగితే రక్తహీనత,నొప్పులు,కంటి సమస్యలు ఉండవు

Energy Milk : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గాలన్నా ఇప్పుడు చెప్పే పాలను 10 రోజులు తాగితే తగ్గిపోతాయి. ఈ మధ్య కాలంలో రక్తహీనత,కంటికి సంబందించిన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు వంటివి ఎక్కువగా వస్తున్నాయి.
Health Benefits of Dates
8 ఎండు ఖర్జూరాలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఎండు ఖర్జూరాలలో గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి పేస్ట్ గా చేయాలి. ఆ తర్వాత 8 బాదం పప్పులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత 8 జీడిపప్పులను ముక్కలుగా కట్ చేయాలి.
Diabetes patients eat almonds In Telugu
లేకపోతే బాదం పప్పు,జీడిపప్పులను మిక్సీలో వేసి రఫ్ గా మిక్సీ చేయవచ్చు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అరలీటర్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక పావు స్పూన్ పసుపు,ఖర్జూరం పేస్ట్, ముక్కలుగా కట్ చేసిన బాదం,జీడిపప్పులను వేయాలి. ఆ తర్వాత అంగుళం దాల్చినచెక్క ముక్కను వేయాలి.
cashew nuts benefits in telugu
5 నుంచి 7 నిమిషాలు మరిగాక పొయ్యి ఆఫ్ చేసి సరిపడా బెల్లం వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు ఈ పాలను తాగితే మోకాళ్ళ నొప్పులు,కీళ్లనొప్పులు,అలసట,నీరసం,రక్తహీనత,కంటికి సంబందించిన సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ఈ పాలల్లో వేసిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
Jaggery Health Benefits in Telugu
ఏదైనా సమస్య ఉన్నప్పుడూ చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. ఇటువంటి పాలను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ పాలను తాగి ఆరోగ్యంగా ఉండండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.