Healthhealth tips in telugu

ఉదయం పరగడుపున తాగితే డయాబెటిస్,అధిక బరువుకు చెక్…మరెన్నో ప్రయోజనాలు…

Fenugreek seeds Tea Benefits : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ డయాబెటిస్ మరియు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, సరైన వ్యాయామం లేని కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే ఆహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి.
Diabetes In Telugu
డయాబెటిస్‌ కారణంగా తీపి తినాలనుకుంటే నోరు కట్టేసుకోవడమే కాకుండా.. తరచూ చెకప్‌లు చేయించుకోవడం, ఇన్సులిన్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు ఇంజక్షన్‌లు తీసుకోవడం పెద్ద ప్రహసనం. డయాబెటిస్ కారణంగా అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యలన్నింటికీ మెంతి టీతో చెక్‌ పెట్టవచ్చంటున్నారు న్యూట్రీషనిస్టులు.
fenugreek seeds Benefits in telugu
మెంతి గింజలతో తయారు చేసే టీతో డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదే విధంగా పరగడుపున ఈ టీ తాగడం ద్వారా అధిక బరువు నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొంటున్నారు. అంతేగాక కడుపునొప్పితో బాధ పడేవారికి మెంతి టీ యాంటాసిడ్‌గా ఉపయోగపడి.. జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుందని వెల్లడిస్తున్నారు.
Weight Loss tips in telugu
వేడినీళ్లలో గుప్పెడు మెంతి గింజలను కలుపుకొని తాగడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. తరచుగా ఈ టీని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చని పేర్కొంటున్నారు..కాబట్టి కాస్త ఓపికగా రోజులో పరగడుపున ఒకసారి ఈ టీ తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. మెంతి టీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

మెంతి టీ తయారీ
ఒక టీ స్పూను మెంతి గింజలను తీసుకుని పొడి చేయాలి. ఒక కప్పులో నీటిని తీసుకుని వేడి చేసి.. అందులో మెంతి పొడి కలపాలి. కావాలనుకుంటే టీ స్పూన్‌ తేనె, తులసి ఆకులను కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. 2-3 నిమిషాల తర్వాత ఈ టీని తాగినట్లైతే మంచి ఫలితాలు పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.