Healthhealth tips in telugu

2 స్పూన్స్ ఊపిరితిత్తులలో పేరుకున్న కఫము,శ్లేష్మంను శుభ్రం చేసి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది

Clean Your Lungs in 3 days In telugu : ఊపిరితిత్తులను క్లియర్ చేయడానికి మరియు దగ్గు తగ్గటానికి శక్తివంతమైన సహజసిద్దమైన ఇంటి చిట్కాను తెలుసుకుందాం. జలుబు, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకి అద్భుతమైన నివారణ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా మరియు వైరస్ల నుండి రక్షిస్తుంది. గొంతులో గరగర, గొంతు నొప్పి, శ్లేష్మం వంటి వాటిని తగ్గిస్తుంది.
Ginger benefits in telugu
ఈ రెమిడీ కోసం అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి తురమాలి. అల్లంలో ఉండే శోథ నిరోధక లక్షణాలు శ్వాసనాళాలను తెరవటమే కాకుండా ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.అలాగే పొడి దగ్గు వేగంగా తగ్గటానికి సహాయపడతుంది. రెండు వెల్లుల్లి పాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
garlic
వెల్లుల్లి సహజమైన యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అలాగే ఫినాల్స్,ఫ్లేవనాయిడ్లు,క్వెర్సెటిన్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన బ్యాక్టీరియా మరియు వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అల్లం తురుము, రెండు వెల్లుల్లి రెబ్బల ముక్కలు, రెండు స్పూన్ల apple cider vinegar వేయాలి.

apple cider vinegar దగ్గు మరియు గొంతు నొప్పికి చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత నాలుగు స్పూన్ల నీటిని పోయాలి. ఆ తర్వాత నాలుగు స్పూన్ల తేనె వేయాలి. తేనె జలుబు మరియు ఫ్లూ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మొత్తం అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి.
Honey benefits in telugu
ఈ మిశ్రమం ఫ్రిజ్ లో పెడితే మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు తయారుచేసిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం ఒక స్పూన్,సాయంత్రం ఒక స్పూన్ తీసుకుంటే ఊపిరితిత్తులలో పేరుకున్న కఫము,శ్లేష్మంను శుభ్రం చేసి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే గొంతుకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.