ఈ చెట్టు కనిపిస్తే ఆకులను,గింజలను అసలు వదలద్దు…ముఖ్యంగా ఆ సమస్యలకు…

Kanuga Chettu Benefits In telugu: ఇంటి చుట్టు పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలీదు. ఇటువంటి మొక్కలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కలలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనం రోడ్డు పక్కన ఎక్కువగా కనిపించే ఈ మొక్క గురించి తెలుసుకుందాం. .kanuga chettu benefits in telugu
ఈ మొక్క పేరు కానుగ చెట్టు .ఈ చెట్టును ఆయుర్వేదం లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు.ఈ మొక్క ఆకులను తీసుకుని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
Kanuga Chettu Tips
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. నరాల బలహీనత సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పైల్స్ సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
Kanuga Oil benefits
థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ఈ కషాయం తాగడం వలన థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగు. పడుతుంది. దంత సమస్యలతో బాధపడేవారు ఈ మొక్క యొక్క కొమ్మను ఉపయోగించి పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది
KANUGA chettu benefits
కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా బాగా సహాయపడుతుంది. ఈ నూనెను గజ్జి, తెల్ల మచ్చలు, తామర వంటి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి ఛాతిపై రాస్తే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.