Healthhealth tips in telugu

7 రోజులు 1 స్పూన్ కీళ్ల నొప్పులు,కండరాల నొప్పులు,వెన్ను నొప్పి,వెరికోస్ వెయిన్స్ అన్నీ మాయం అవుతాయి

Joint Pains And varicose veins Homemade Oil : ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ,వెన్ను నొప్పి వంటివి వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే నూనె చాలా బాగా సహాయ పడుతుంది. ఈ నూనె కాళ్లలో వెరికోస్ వెయిన్‌లకు కూడా బాగా పని చేస్తుంది.
Garlic Benefits in telugu
50 గ్రాముల వెల్లుల్లిని తొక్కలు తీసి తురమాలి. వెల్లుల్లిలో ఉన్న పోషకాలు ఎముకలు మరియు కీళ్లకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో కలిగే అన్నీ రకాల మంటలను తగ్గిస్తుంది. కీళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి దోహదం చేసి వైరస్లు, బాక్టీరియా నుండి రక్షిస్తుంది. ఆ తర్వాత ఆలివ్ నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ ని తీసుకోవాలి. ఒక సీసాలో తురిమిన వెల్లుల్లిని వేసి దానిలో వెల్లుల్లి మునిగే వరకు ఆలివ్ ఆయిల్ పోయాలి. సీసాకు మూత పెట్టి బాగా షేక్ చేసి 15 రోజుల పాటు కదపకుండా అలా ఉంచాలి.

వెల్లుల్లి మరియు ఆలివ్ నూనె కలిపినప్పుడు వాటి ప్రభావం రెట్టింపు అవుతుంది. 15 రోజులు తర్వాత ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసు కోవాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకొనే ముందు ఈ విధంగా చేస్తే ఉదయం లేచే సరికి నొప్పులు తగ్గుతాయి.
Powerful Pain Killer oil
నొప్పులు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంటి చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.అదే నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచించిన సూచనలను పాటిస్తూ ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుం నొప్పి,కండరాల నొప్పులు ఇలా అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.