హైబీపీతో బాధపడేవారు ఈ డ్రింక్స్ తీసుకుంటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు
High Bp Reduced Drinks : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య. అధిక రక్తపోటు అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా మందులను వాడాలి.
ఒక్కసారి బీపీ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే. అలా మందులు వాడుతూ కొన్ని Drinks తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెకు సంబందింకిన సమస్యలు వస్తాయి. కాబట్టి రక్తపోటు నియంత్రణలో ఉండాలి.
రక్తపోటు నియంత్రణలో ఉండటానికి మందారం టీ చాలా బాగా సహాయపడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి రెండు తాజా మందార పువ్వులు లేదా ఎండిన మందార పువ్వులు వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. మందార టీలో ఆంథోసై నిన్, యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలు కుంచించుకుపోకుండా రక్తప్రసరణ బాగా సాగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
బీట్‌రూట్ రసంను ప్రతి రోజు తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీట్ రూట్ ని ఉడికించి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క,నీటిని పోసి మిక్సీ చేసి తాగాలి. బీట్ రూట్ లోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
ఇప్పుడు చెప్పిన మందారం టీ,బీట్ రూట్ రసం రెండు కూడా రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. మీకు ఏది సులువుగా దొరికితే దానిని ఫాలో అయ్యి రక్తపోటు సమస్య నుండి బయట పడండి. రక్తపోటు వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇటువంటి ఆహారాలను తీసుకుంటే రక్తపోటు కోసం వాడే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.