1 స్పూన్ ఇలా తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

A natural remedy for cleansing blood vessels : రక్త నాళాలను శుభ్రం చేయటానికి ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఒక స్పూన్ తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లను తొలగించి రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. varicose veins ఉన్నవారిలో రక్తప్రసరణ బాగా జరగటానికి సహాయపడుతుంది. ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

అవి వెల్లుల్లి,నిమ్మకాయ. ఈ రెండు కూడా మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. మూడు నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రక్త నాళాల ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మరసం ఫలకం కారణంగా తరచుగా దెబ్బతినే రక్త నాళాల గోడలను బలపరుస్తుంది.

ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లితో నిమ్మకాయ కలిసినప్పుడు రెట్టింపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. స్ట్రోక్ మరియు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 50 గ్రాముల వెల్లుల్లిని తీసుకొని పై తొక్క తీసేయాలి. వెల్లుల్లిలో సహజ యాంటీబయాటిక్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంలోని అన్ని వాపులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
Garlic Benefits in telugu
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రక్తాన్ని శుభ్రపరచటమే కాకుండా సిరలు మరియు ధమనులకు స్థితిస్థాపకతను పునరుద్ధరిస్తుంది.గుండె మరియు హృదయ నాళ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ, వెల్లుల్లి రక్తం పలుచగా ఉండేలా చేయటమే కాకుండా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

చిక్కగా ఉన్న రక్తాన్ని పలుచగా చేస్తుంది. నిమ్మకాయ ముక్కలు,వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి సీసాలో నిల్వ చేయాలి. ఫ్రిజ్ లో పెడితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.