నరాల బలహీనతను తగ్గించి నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరచి మతిమరుపు లేకుండా చేస్తుంది

Best Foods for Your Nervous System : నరాల బలహీనత లేకుండా నాడీ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చాలా అవసరం. మన శరీరం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేయలేవు. దెబ్బతిన్న నరాలను సరిచేయడానికి మరియు నరాలవ్యాధి చికిత్సకు చాలా బాగా సహాయపడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చేపలలో ఎక్కువగా ఉంటుంది. చేపలను తినని వారు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.

అరటిపండు కూడా నరాల బలహీనత లేకుండా నాడీ వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. అరటిపండులో విటమిన్ B6 సమృద్దిగా ఉండుట వలన న్యూరోట్రాన్స్మిటర్లు అన్ని అవయవాలకు సంకేతాలను పంపడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఒక అరటిపండు తింటే మంచిది. అరటిపండ్లు అన్నీ కాలాల్లోనూ లభ్యం అవుతాయి.
weight loss drink
చియా గింజలలో కొన్ని అద్భుతమైన ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఈ గింజలలో కాల్షియం కూడా సమృద్దిగా ఉంటుంది. మనలో చాలా మంది కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుందని అనుకుంటారు. కానీ నాడీ వ్యవస్థకు కూడా మద్దతు ఇస్తుంది. కాల్షియం మెదడు కణాల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

శరీరంలోని ఇతర భాగాలకు కమ్యూనికేషన్ కోసం మార్గాలను రూపొందించడంలో సహాయపడుతుంది. కాల్షియం నరాల కణాలను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. .అంతేకాకుండా అవి దెబ్బతిన్న తర్వాత వాటిని తిరిగి నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు పావు స్పూన్ చియా గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది.

ఎరుపు, నీలం రంగులో ఉండే బెర్రీలలో ఆంథోసైనిన్లు అనే ఫ్లేవనాయిడ్ ఉండుట వలన డయాబెటిక్ న్యూరోపతి అలాగే నాడీ వ్యవస్థకు బాగా హెల్ప్ చేస్తుంది. వృద్ధాప్యం నుండి మెదడు కణాలను కాపాడుతుంది. మెదడులో రక్తప్రవాహానికి అడ్డం లేకుండా చేస్తుంది. న్యూరాన్‌లను దెబ్బతీసే వాపును తగ్గించి అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలను తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.