చలికాలంలో పెరుగు తింటున్నారా… ఇది ఖచ్చితంగా తెలుసుకోండి…నమ్మలేని నిజాలు

curd benefits In telugu :ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంల కచ్చితంగా పెరుగు ఉండాలసిందే. భోజనం చివరిలో పెరుగు అన్నం తినకపోతే అన్నం తిన్నట్టుగా కూడా ఉండదు. అంతలా పెరుగు మన జీవితంలో బాగం అయిపోయింది. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి.
curd benefits in telugu
మనలో కొంతమంది చలికాలం రాగానే పెరుగు తినటం మానేస్తూ ఉంటారు. చలికాలంలో పెరుగు తింటే జలుబు,దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడతారు. అయితే నిపుణులు మాత్రం తప్పనిసరిగా చలికాలంలో పెరుగు తినాలని చెప్పుతున్నారు. ఎందుకంటే పెరుగు తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి జలుబు,దగ్గు వంటి సమస్యల మీద పోరాటం చేసే శక్తి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు.
Immunity foods
పెరుగులో రోగనిరోధక శక్తిని పెంచే ప్రోబైయటిక్స్ ,విటమిన్స్ ,పోటాషియం , క్యాల్షియం,మెగ్నీషియం , మరియు శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల బాక్టీరియను కల్గి ఉంటుంది. పెరుగులో ఉన్న పోషకాలు జీర్ణ సంబంద సమస్య అయినా మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముక‌ల‌ను, దంతాల‌ను మ‌రియు కండ‌రాల‌ను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

పెరుగు పగటి సమయంలో తినటమే మంచిది. ఆస్త‌మా వ్యాధి ఉన్న వారు మాత్రం ఈ చ‌లి కాలంలో రాత్రి వేళ‌లో పెరుగు, మ‌జ్జిగ వంటి వాటికి దూరంగానే ఉండాలి. పెరుగును క్ర‌మం త‌ప్ప‌కుండా ఆహారంలో తీసుకోవ‌డంవ‌ల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ అటాక్ వంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశం త‌గ్గుతుంది. రక్తపోటును కూడా పెరుగు కంట్రోల్ చేస్తుంది.
Curd Rice
చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టి తీసుకోవడం కంటే సాధారణంగా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ లో పెట్టుకున్న పెరుగును మాత్రం రాత్రి సమయంలో తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పెరుగును తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.