1 గ్లాస్ తాగితే చాలు ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు….ముఖ్యంగా ఈ సీజన్ లో

Monsoon Drink : ఈ చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఇవి వచ్చాయంటే తొందరగా తగ్గవు. ఈ సమస్యల నుండి బయట పడాలంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి ఒక డ్రింక్ తయారుచేసుకుందాం.
dhaniyalu
ఈ డ్రింక్ తయారి కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి. ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు జీలకర్ర, ఒక కప్పు సొంపు, అరకప్పు మిరియాలు తీసుకోవాలి. వీటిని పాన్ లో వేసి పొయ్యి మీద పెట్టి సిమ్ లో మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. బాగా వేగాక కొంచెం చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి.
jeelakarra Health Benefits in telugu
పొయ్యి వేలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ పొడిని వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు తాగుతూ ఉంటే సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి ఉండవు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
sompu
దగ్గు,జలుబు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి అన్నీ రకాల సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఇటువంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు. కడుపు నొప్పి,గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవు.

ఈ పొడికి ఉపయోగించిన ధనియాలు,జీలకర్ర,సొంపు,మిరియాలలో ఉన్న లక్షణాలు ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటానికి సహాయ పడతాయి. ఈ డ్రింక్ ని 15 రోజుల పాటు ప్రతి రోజు తాగుతూ ఉంటే అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. కాబట్టి ఈ సీజన్ లో కాస్త శ్రద్ద పెట్టి ఈ పొడి తయారుచేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.