1 స్పూన్ తీసుకుంటే చాలు మీ ఒంట్లో కొవ్వు,అధిక బరువు మంచులా కరిగిపోతుంది

sabja seeds benefits : ఈ రోజు బరువు తగ్గించటానికి సబ్జా గింజలు ఎలా సహాయ పడతాయి చూద్దాం. సాధారణంగా మనలో చాలామంది సబ్జా గింజలు అంటే వేడి తగ్గించడానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ సబ్జా గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వీటిలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

చాలా చవకగా మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఈ మధ్యకాలంలో సబ్జా గింజలని తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోషకాహార నిపుణులు కూడా సబ్జా గింజలు తీసుకోమని చేస్తున్నారు. పూర్వకాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఇటీవల కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సబ్జా గింజలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతాయి.

సంవత్సరం పొడవునా సబ్జా గింజలను వాడవచ్చు.ఒక స్పూన్ గింజలను ఒక గంట పాటు నీటిలో నానబెడితే గింజల పరిమాణం రెండింతలు అవుతుంది. నీటిలో వేస్తె బాగా ఉబ్బుతాయి.ప్రతి నల్ల గింజకి అపారదర్శక తెల్లని ఫిల్మ్ పూత ఉంటుంది. నీటిలో సబ్జా గింజలు నానబెట్టడం వల్ల యాంటీఆక్సిడెంట్స్, ప్రయోజనకరమైన జీర్ణ ఎంజైమ్‌ లను విడుదల చేస్తాయి.సబ్జా గింజలు బరువు తగ్గించటానికి ఎలా తీసుకోవాలి ఎలా తగ్గిస్తాయో వివరంగా తెలుసుకుందాం.
Weight Loss tips in telugu
అధిక బరువును తగ్గించడానికి సబ్జా గింజలు మంచి మార్గం. సబ్జా గింజలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటే బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల్లో అధిక మొత్తంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఈ ఆమ్లాలు శరీరంలో కొవ్వును కరిగించి జీవక్రియని పెంచడంలో సాయపడతాయి. సబ్జా గొంజల్లో ఫైబర్‌ కూడా ఉంటుంది.
sabja weight loss drink
కాబట్టి మీ కడుపుని ఎక్కువసేపు సంతృప్తికరంగా ఉంచుతుంది. ఏమైనా తినాలన్న కోరికలను నివారిస్తుంది. సబ్జా గింజలలో పిండి పదార్ధాలు తక్కువగాను ప్రోటీన్స్ ఎక్కువగాను ఉంటాయి. మీరు సబ్జా గింజల్ని పెరుగులో వేసుకొని తినొచ్చు. ఆకలిని నియంత్రించడానికి కొన్నింటిని ఫ్రూట్ సలాడ్‌ పై చల్లి భోజనానికి ముందు అల్పాహారంగా తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.