ప్రతి రోజు 1 పండు తింటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గి గుండె సమస్యలు రావు
Pears Health benefits In telugu : పియర్స్ ఈ సీజన్ లో ఎక్కువగా లభ్యమవుతాయి. ప్రతి రోజు ఒక పియర్ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా కాపాడుతుంది. .
అలాగే ఈ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. పియర్ పండులో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫైబర్, పోలేట్, పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. పియర్స్ లో పెక్టిన్ అనే కాంపౌండ్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ పండులో ఉండే పొటాషియం రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. .
అలాగే జీర్ణ సంబంద సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు కూడా రోజుకి ఒక పండు తింటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. రక్తం తక్కువగా ఉన్నావారు, బలహీనంగా, నీరసంగా ఉండేవారు ఈ పండ్లను తింటే మంచిది. వీటిలోని ఐరన్, కాపర్ శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి.
రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ పండులో రాగి, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలహీనంగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు ఒక పియర్ పండును తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ పండ్లు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.