చిటికెడు పొడిని ఇలా తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Pippali Health Benefits In Telugu : Pippallu లేదా Pippali లేదా Long Pepper అంటారు. వీటిలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. Pippallu ను వేగించి పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి.
Pippali
ఒక స్పూన్ తేనెలో రెండు చిటికెల Pippallu పొడిని తీసుకుంటే ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక రెండు చిటికెల పొడిని వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తేనె కలిపి తాగవచ్చు. ఈ పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది.
Diabetes symptoms in telugu
డయాబెటిస్ ఉన్నవారు ఈ పొడిని తీసుకుంటే ఈ పొడిలో ఉండే హైపోగ్లైసీమిక్ లక్షణం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బీటా ప్యాంక్రియాటిక్ కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. ఇది గ్లూకోజ్‌గా స్టార్చ్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆ విధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
Weight Loss tips in telugu
యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని వేదిస్తున్న అధిక బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. శరీరాన్ని సమర్థవంతంగా నిర్విషీకరణ చేస్తుంది. ఆకలి వేయకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
lungs
ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు మరియు జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరితిత్తుల కణజాలాలను బలోపేతం చేయడానికి మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడటమే కాకుండా శ్వాసకోశం నుండి కఫం తొలగించటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.