రోజుకి 5 గింజలు తింటే డయాబెటిస్, అధిక బరువు,గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు

Lotus Seeds benefits In Telugu : తామర గింజలకు మరొక పేరు పూల్ మఖని అని, అలాగే ఇంగ్లీష్ లో వీటిని ఫాక్స్‌నట్స్ అని అంటారు. Lotus Seeds లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిల్లో ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం, ఫాస్ఫరస్,ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి.
Pool makhana milk benefits
అలాగే యాంటీ ఆక్సిడెంట్,ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రతి రోజు 5 తామర గింజలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. తామర గింజలను పాలలో ఉడికించి తీసుకోవచ్చు లేదంటే అరస్పూన్ నూనెలో కాస్త వేగించి ఉప్పు కారం చల్లుకొని తినవచ్చు.

వీటిలో సోడియం తక్కువ పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రక్తం ఆక్సిజన్ నాణ్యతను మెరుగుపరిచి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
వీటిలో ప్రోటీన్,ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Diabetes In Telugu
Lotus Seeds లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన అలాగే క్యాల్షియం, మెగ్నీషియం ఉండటం వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉన్న వంటి సమస్యలను తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. రోజుకి 5 తామర గింజలను మాత్రమే తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.