Healthhealth tips in telugu

కేవలం 5 రూపాయిల ఖర్చు….రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య జీవితంలో ఉండదు

Hemoglobin foods : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో
హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ అనేది శరీరం అంతట ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి, జీవక్రియ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడుతుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది ఎర్ర రక్త కణాల్లో కనిపిస్తుంది. రక్తం ఎర్రగా ఉండటానికి హిమోగ్లోబినే కారణం. హీమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్ ను రక్త కణాల నుండి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. మనం ఊపిరి వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటకు విడుదలవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే సరిపోతుంది.

నువ్వులను మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. నువ్వులలో ఐరన్, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, కాపర్‌ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారిలో నీరసం,అలసట కనిపిస్తుంది. నువ్వులు,బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని రోజుకి ఒకటి తింటే సరిపోతుంది.
Barnyard Millet Benefits In Telugu
ఈ మధ్య కాలంలో మిల్లెట్స్‌ వాడకం చాలా ఎక్కువ అయింది. మిల్లెట్స్ లో ఒకటైన ఊదలను ఆహారంలో బాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఊదలలో కెలొరీలు తక్కువ, ఫైబర్‌, ప్రొటీన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తీసుకుంటే రోజులో శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని చాలా తొందరగా పెంచుతుంది.

ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్ సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. రోజుకి 5 ఎండుద్రాక్షను తింటే సరిపోతుంది. ఇలా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/