ఉసిరి+అల్లం టీ తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు….ముఖ్యంగా ఈ సీజన్ లో…

Amla Ginger Tea Benefits : మన శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వైరస్, బ్యాక్టీరియాతో పోరాటం చేసి మన శరీరాన్ని కాపాడుతుంది. మన శరీరంలో విషాలను బయటకు పంపించడానికి, బరువు తగ్గించడానికి, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి ఇప్పుడు చెప్పే టీ బాగా సహాయపడుతుంది.

ఈ టీ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ టీ కోసం ఉసిరి, అల్లం ఉపయోగిస్తున్నాం. ఉసిరి మరియు అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది. ఫ్రీ ఆర్టికల్స్ ద్వారా శరీరం దెబ్బ తినకుండా కాపాడుతుంది.
Ginger benefits in telugu
అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉసిరి మన జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలి తగ్గించి తినాలనే కోరికను తగ్గిస్తుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిది. ఉసిరి మరియు అల్లం ఈ రెండు కూడా శరీరంలో మంటతో పోరాటం చేసి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Immunity foods
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉసిరి, అల్లం రెండింటిలోనూ విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఈ డ్రింక్ లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో కొల్లాజెన్ పెంచడంలో సహాయపడి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది అయ్యేలా చేస్తాయి. ఇక ఈ టీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
Weight Loss tips in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి నాలుగు కప్పులు నీటిని పోయాలి. దానిలో ఒక స్పూన్ ఉసిరి పొడి లేదా రెండు ఉసిరికాయల ముక్కలు, ఒక స్పూన్ అల్లం తురుము వేసి ఒక కప్పు నీరు అయ్యేవరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.