ఇలా చేస్తే 99% కీళ్ల నొప్పులు,,నడుం నొప్పి,కాళ్లు,చేతులో నొప్పులు అన్ని చిటికెలో మాయం అవుతాయి

Ayurveda medicine for osteoarthritis : ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే అంటే 35 సంవత్సరాలు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులు రావటానికి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం, అధిక బరువు వంటి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆహారంలో మార్పుల ద్వారా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
Joint pains in telugu
వయసు పెరిగే కొద్దీ ఎముకలు అరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఎముకలు లేదా కండరాలకు గాయం అయ్యినప్పుడు, అధిక బరువు,మోకాలి లేదా కండరాలపై ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు, మోకాలి ఎముకలు బలహీనంగా ఉన్నప్పుడూ కీళ్ల నొప్పుల సమస్య వస్తుంది. కీళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది.
weight loss tips in telugu
కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్ సలహా ప్రకారం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. పసుపు నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ పాలల్లో పావు స్పూన్ పసుపు కలిపి తాగాలి. ప్రతి రోజు వంటలలో పసుపు వాడాలి.
Ginger benefits in telugu
అల్లం,జీలకర్ర కూడా నొప్పుల నుండి ఉపశమనం కలిగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.

అలాగే జీడిపప్పు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎముకలకు ఆయిల్ కంటెంట్ అందించి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల మధ్య జిగురు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎప్పుడైనా మంచి పోషకాలను అందించే ఆహారాలను తీసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నడుం నొప్పి,కాళ్లు,చేతులో నొప్పులు అన్ని చిటికెలో మాయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.