Healthhealth tips in telugu

పరగడుపున స్వీట్ తింటే ఏమి అవుతుందో తెలుసా…ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…

Empty stomach Aviod sweets : మనలో చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. స్వీట్స్ చూస్తే అస్సలు వదిలబుద్ధి కాదు. కొంతమంది స్వీట్ అంటే అస్సలు ఇష్టపడరు. అయితే మనం ఇప్పుడు స్వీట్ అంటే ఇష్టపడే వారి గురించి తెలుసుకుందాం. పరగడుపున స్వీట్స్ మరియు పంచదారతో తయారు చేసిన పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

అలా ఉదయం పరగడుపున స్వీట్స్ తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఎదురవుతాయని గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు వస్తాయని, అందువల్ల ఉదయం సమయంలో మంచి పోషకాలు ఉన్న ఉడికించిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది చెబుతున్నారు. అంతే కాకుండా ఎక్కువ కారంగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోకూడదని చెబుతున్నారు.

అలాగే ఉదయం పుల్లని పదార్థాలు అంటే సిట్రస్ జాతి పండ్లు, టమాటా వంటి వాటిని కూడా పరగడుపున తీసుకోకూడదు. టమాటాలను పరగడుపున తీసుకుంటే టమాటా లో ఉండే టానిక్ యాసిడ్ కొన్ని సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి ఉదయం పరగడుపున పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి.
cold remedies
ఉదయం పరగడుపున పంచదార మరియు పంచదారతో తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల శరీరం సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం జరగదు. తక్కువ సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది. ఇది సెడన్ గా బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా ఎటువంటి చికాకు లేకుండా ఉషారుగా పనులను చేసుకుంటారు. కాబట్టి ఉదయం ముఖ్యంగా పరగడుపున తీసుకొనే ఆహారం విషయంలో తప్పనిసరిగా శ్రద్ద పెట్టాలి. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.