ఈ సీజన్ లో వారంలో 2 సార్లు బేబీ కార్న్ తప్పనిసరిగా తినాలి….ఎందుకంటే…

Baby Corn Benefits In telugu : ఈ మధ్య కాలంలో బేబీ కార్న్(Baby Corn) తో సంప్రదాయ వంటకాలతో పాటు వెరైటీ డిష్ లు చేయటం కూడా ఎక్కువ అయింది. Baby Corn మంచి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. Baby Corn ని రెగ్యులర్ గా తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు అంటున్నారు. Baby Corn లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
Weight Loss tips in telugu
ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఆహారం అని చెప్పాలి. ఎందుకంటే Baby Corn లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల Baby Corn తింటే కేవలం 26 క్యాలరీలు మాత్రమే మన శరీరానికి అందుతాయి. Baby Corn లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, సోడియం, కాల్షియం  మరియు ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Diabetes In Telugu
Baby Corn లో పీచు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించి మధుమేహం నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచి కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో కొలస్ట్రాల్ ని తగ్గించి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు రాకుండా చేస్తుంది.

Baby Corn లో విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన పోషణ అందుతుంది. Baby Corn లో ఫోలేట్ సమృద్ధిగా ఉండుట వలన గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు Baby Corn తింటే చాలా మంచిది. కెరోటినాయిడ్స్ కంటికి సంబందించిన సమస్యలు రాకుండా కాపాడటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడతాయి. 

కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. Baby Corn లో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. విటమిన్ B6 ఉండుట వలన గర్భధారణ సమయంలో ఉండే వాంతులు,వికారం తగ్గటానికి సహాయపడుతుంది. Baby Corn లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం మరియు క్యాన్సర్ కణాల మీద పోరాటం చేయటమే కాకుండా నియంత్రిస్తాయి. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.