ఈ నూనె రాస్తే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి అన్ని నొప్పులు నిమిషంలో తగ్గిపోతాయి

Joint Pains Home Remedies : మారిన జీవనశైలి పరిస్థితులు, శారీరిక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు అలా కూర్చోవడం వంటి అనేక రకాల కారణాలతో శరీరం బలహీన పడిపోయి చిన్న చిన్న పనులు చేసిన నొప్పులు విపరీతంగా వచ్చేస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.
Joint pains in telugu
ఈ నొప్పులను తగ్గించడానికి ఒక అద్భుతమైన నూనె ఉంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా మన ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు.
ఈ నూనె కోసం ఉమ్మెత్త కాయలు ఉపయోగిస్తున్నాం. ఉమ్మెత్త కాయలు రోడ్డుకు ఇరువైపులా ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. నాలుగు ఉమ్మెత్త కాయలను తీసుకుని తొడిమ తీసి సిద్దం చేసుకోవాలి.

ఉమ్మెత్త కాయలలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆ తర్వాత మనం ఆవ నూనె.ను తీసుకోవాలి. అవ నూనె నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఒక గిన్నెలో తొడిమ తీసిన ఉమ్మెత్త కాయలను వేసుకోవాలి. అవి మునిగే వరకు ఆవనూనె పోయాలి.
Mustared oil Benefits in telugu
దాదాపుగా 20 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత నూనె రంగు మారుతుంది. అలా రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన నూనెను వడగట్టి సీసాలో నిలువ చేసుకోవచ్చు. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా రెండు రోజులపాటు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
Powerful Pain Killer oil
ఉమ్మెత్తలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులు, నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఆవనూనెలో కూడా వేడి చేసే గుణం ఉంటుంది. ఇది నొప్పులను తగ్గించి వాపులను నివారించడంలో సహకరిస్తుంది.కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి నొప్పుల నుండి ఉపశమనం పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.