1 గ్లాసు 15 రోజులు స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా స్లిమ్ గా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్

Lemon and Ginger Weight Loss Drink ; మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక నిరాశ చెందుతూ ఉంటారు. అలా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కాస్త ఓపికగా మన ఇంటిలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఒక డ్రింక్ తయారు చేసుకొని 15 రోజులు పాటు తాగితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ రెమిడి కోసం నిమ్మకాయను ఉపయోగిస్తున్నాం.
Ginger benefits in telugu
నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఒక లీటరు నీటికి నాలుగు నిమ్మకాయలు సరిపోతాయి. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
jeelakarra Health Benefits in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక లీటర్ నీటిని పోసి నిమ్మకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత ఒక కప్పు కొత్తిమీర వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో ఒక గ్లాసు తాగాలి. .

ఈ నీటిని ఫ్రిజ్ లో పెడితే వారం రోజులు వరకు నిలువ ఉంటాయి. ప్రతిరోజు ఈ నీటిని కాస్త గోరువెచ్చగా చేసుకుని తాగితే 15 రోజుల్లో తేడా కచ్చితంగా కనబడుతుంది. అవసరమైతే తేనె కూడా కలుపుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది. ఈ డ్రింక్ లో వేసిన జీలకర్ర మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే సోంపు జీర్ణశక్తి మెరుగు పడేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.