Healthhealth tips in telugu

భోజనం చేసిన తర్వాత సోంపు తింటున్నారా…. ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

sompu Health Benefits : సోంపును ఇంగ్లీష్ లో fennel seeds అని పిలుస్తారు. సాధారణంగా మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపు తింటూ ఉంటాం. ఈ విధంగా సోంపు తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఈ సోంపు గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. 
sompu
మౌత్ ఫ్రెషనర్లు, ఐస్ క్రీములు మరియు పేస్ట్ ఇలా అనేక రకాలలో మంచి సువాసన కోసం సోంపును ఉపయోగిస్తారు. సోంపు గింజలు జీలకర్రను పోలి ఉంటాయి. సోంపు గింజలను వంటల్లోనే కాకూండా అనేక రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
fennel Seeds Benefits In telugu
సోంపు గింజల్లో శక్తివంతమైన రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. సోంపు గింజలు సంవత్సరం మొత్తం లభ్యం అవుతాయి. ఇవి పొడి రూపంలోనూ,గింజల రూపంలోనూ లభ్యం అవుతాయి. సోంపు గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Liver Cleaning
ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. సోంపు గింజలలో ఫెలినీయం ఉండుటవలన కాలేయంలో ఉండే ఎంజైమ్స్ ని ఉత్తేజపరిచి కాలేయం పనితీరు బాగుండేలా చేయటంతో పాటు హానికర పదార్ధాలను బయటకు పోయేలా చేస్తుంది.
liver
అంతేకాక కాలేయం ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సోంపు గింజలతో తయారుచేసిన టీ త్రాగవచ్చు. లేదా సోంపు గింజలను నమలవచ్చు. సోంపు గింజలను ఏ రూపంలో తీసుకున్న కాలేయ పనితీరు బాగుంటుంది. గొంతు సంబంధ సమస్యలు తగ్గటానికి సోంపు గింజలు బాగా సహాయపడతాయి.

గొంతులో అడ్డం పడిన శ్లేష్మంను తొలగించటానికి బాగా హెల్ప్ చేస్తుంది. సోంపు గింజల్లో విటమిన్ సి మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. ఋతు క్రమ లక్షణాలను నియంత్రిస్తుంది .శరీరంలో హార్మోన్స్ సరైన క్రమంలో ఉండేలా చేసి ఋతుక్రమం సరైన పద్దతిలో అయ్యేలా చూస్తుంది. నొప్పి నివారిణిగా కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.