పాలలో ఈ పొడి కలిపి తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు

Good sleep Foods : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి అనేక రకాల కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
మనిషికి దాదాపుగా 7 నుండి 8 గంటల నిద్ర అవసరం.
sleeping problems in telugu
సరైన నిద్ర లేకపోతే శారీరక,మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పని ఒత్తిడి, నైట్‌‌అవుట్స్‌‌, మొబైల్ ఫోన్స్, టి.వి ఎక్కువగా చూడటం వంటి కారణాలతో నిద్ర సరిగా పట్టదు. సరైన నిద్ర లేకపోతే అలసట, చికాకు, ఒత్తిడి, గ్యాస్ట్రిక్‌‌, జీర్ణ సంబంద సమస్యలు, బద్ధకం, ఏకాగ్రత లేకపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్‌‌ వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
nutmeg
నిద్ర పట్టటానికి అసలు మందుల జోలికి వెళ్లకూడదు. సహజసిద్దమైన చిట్కాలతో మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చిట్కాలను పాటించాలి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే నిద్ర బాగా పడుతుంది. జాజికాయ పొడి నిద్ర బాగా పట్టటానికి సహాయపడుతుంది.
milk
జాజికాయను మసాలా దినుసుగా ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనిలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు జాజికాయ పొడిని కలిపి తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
Honey benefits in telugu
జాజికాయ పొడిని పాలల్లో కలిపి తాగవచ్చు…లేదంటే తేనెలో కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా తీసుకోవటం వలన శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రెండూ మంచి నిద్రకు సహాయపడతాయి. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా ఫాలో అవ్వవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.