Healthhealth tips in telugu

అరస్పూన్ పొడి గ్లాసు పాలలో కలిపి తీసుకుంటే నరాల బలహీనత తగ్గటమే కాదు…జన్మలో రాదు

Nerves weakness home remedies in telugu : నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం. అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలను చూస్తుంటాం.

ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఆహారం లోపం వలన ,ఫిజికల్ గా ఎటువంటి పని చేయకపోయినా,వయస్సు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు.

సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలా మంది టాబ్లెట్స్ వాడుతూఉంటారు. ఆలా మందులు వాడుతూ ఇంటిలోనే ఒక పొడిని తయారుచేసుకొని వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ పొడి కోసం ఒక మిక్సీ జార్ లో 10 గ్రాముల వాల్ నట్స్, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల దాల్చినచెక్క, 10 గ్రాముల అవిసే గింజలు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
walnut benefits in telugu
ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని ప్రతి రోజు అరస్పూన్ పొడిని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగాలి. ఈ విధంగా తాగటం వలన నరాల బలహీనత తగ్గటమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలసట లేకుండా ఉంటుంది. సహజసిద్ధమైన పదార్ధాలు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఈ పొడిని పాలలో కలుపుకొని ఉదయం లేదా రాత్రి పడుకొనే ముందు తాగితే సరిపోతుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తాగుతూ ఉంటే క్రమంగా నరాల బలహీనత తగ్గుతుంది. ఈ పొడిలో వాడిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు నరాల బలహీనతను తగ్గిస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.