Healthhealth tips in telugu

ఉడికించిన వేరుశనగ గింజలను తింటున్నారా…తినే ముందు ఈ నిజాలను తెలుసుకోండి

Boiled peanuts benefits : ఫాబేసి కుటుంబానికి చెందిన వేరుశనగలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగను ఆంధ్రాలో ఎక్కువగా వాడతారు. వీటిని చట్నీ, స్నాక్, లెమన్ రైస్,పులిహోర వంటి రకరకాల వంటకాల్లో వాడతారు. రోడ్డు మీద ఎక్కడ చూసిన ఘుమ ఘుమలాడే వాసనతో దర్శనం ఇస్తాయి. వీటిని చూడగానే ప్రతి ఒక్కరు తింటారు.
peanuts side effects
పల్లెటూర్లలో వేరుశనగ పంట చేతికి రాగానే ప్రతి ఇంటిలో వేరుశనగను వేగించి లేదా ఉడికించి తింటారు. వేరుశనగను పచ్చిగా లేదా వేగించి తినటం కన్నా ఉడికించి తింటేనే మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేరుశనగ పంట రాగానే కాయలు బాగా పచ్చిగా ఉంటాయి.
వాటిలో ఉప్పు వేసుకొని ఉడికించి తింటే చాలా రుచిగా ఉంటాయి.
Peanuts Health benefits in telugu
అలాగే వేరుశనగ గింజలను అయితే రెండు గంటలు నానబెట్టి ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి. ఉడికించిన వేరుశనగలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కొంత మంది వేగించిన వేరుశనగ అంటే ఇష్టపడతారు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను చూస్తే వేగించిన వేరుశనగను ఇష్టపడేవారు కూడా ఉడికించిన వేరుశనగను ఇష్టపడతారు.

ఇపుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వేరుశనగలో ప్రొటీన్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు శరీరానికి అందుతాయి. ఒక గుప్పెడు ఉడికించిన వేరుశెనగ పప్పు తింటే వచ్చే ప్రొటీన్ల బలం పాలు, కోడిగుడ్డు తిన్నాకూడా రాదు. పాలలోని ప్రొటీన్లు నెయ్యిలోని కొవ్వు పదార్థాలు రెండూ వేరుశెనగపప్పులోఉన్నాయి.

పాలు, బాదంపప్పు, నెయ్యి తింటే లభించే పోషక పదార్థాలు కేవలం వేరుశెనగపప్పు తింటే లభిస్తుంది. వేరుశనగలో పోషకాలు డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలతో సమానంగా ఉంటాయి. ఉడికించిన వేరుశనగలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఉడికించిన వేరుశనగల్లో 90 క్యాలరీలుంటాయి. అదే వేయించిన డ్రై వేరుశనగల్లో అయితే 166క్యాలరీలుంటాయి.
Weight Loss tips in telugu
కాబట్టి ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. అరకప్పు ఉడికించిన వేరుశనగలో 30 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఏదీ నరాల,కండరాల పనితీరుకు సహాయపడుతుంది. తీసుకున్న ఆహారాన్ని ఎనర్జీగా మారటానికి సహాయపడుతుంది.ఉడికించిన వేరుశనగలో బి కాంప్లెక్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి.
Brain Foods
ఇవి అవయవాల నిర్వహణ మరియు రక్త వృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉడికించిన వేరుశనగను స్నాక్స్ గా తీసుకోవటం వలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అరకప్పు వేరుశనగ గింజల్లో 12గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల న్యాచురల్ షుగర్ ఉంటుంది. కొలస్ట్రాల్ అసలు ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.