డయాబెటిస్ ఉన్నవారికి ఈ డ్రింక్ దివ్య ఔషధం…షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది

Betel leaf and Black Cumin Seeds : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలా వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
Diabetes In Telugu
ఇప్పుడు చెప్పే నీటిని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో అరస్పూన్ నల్ల జీలకర్ర, ఒక తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి.

ఈ విధంగా రోజు తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
black Cumin Seeds
Black Cumin seeds ఆయుర్వేదం shops లేదా Online Stores లో లభ్యం అవుతాయి. ఈ రెమిడీని ఫాలో అయితే డయాబెటిస్ నియంత్రణలో ఉండి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తూ ఇలా నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Diabetes symptoms in telugu
డయాబెటిస్ ఉన్నవారు అసలు అశ్రద్ద చేయకూడదు. ఒకవేళ అశ్రద్ద చేస్తే గుండె,మెదడు,కిడ్నీ,కళ్ళు వంటి వాటి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. డయాబెటిస్ వచ్చినప్పుడు ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభించాలి. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగటానికి ప్రయత్నం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.