Healthhealth tips in telugu

ఉదయం ప్రోటీన్ షేక్‌ తాగితే అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు

Homemade protein shake : మన శరీరానికి అవసరమైన పోషకం ప్రోటీన్. శరీరానికి ప్రోటీన్ సరిగా అందకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. శరీరానికి ప్రోటీన్ సరిగ్గా అందితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుండె పనితీరు బాగుంటుంది. అలాగే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. .
oats benefits
మనలో చాలామంది మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటిలో తయారు చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రోటీన్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రోటీన్ షేక్ తయారుచేయటం చాలా సులభం. ఒక బౌల్ లో ఒక గ్లాసు పాలను పోయాలి.
Peanuts Health benefits in telugu
ఆ తర్వాత మూడు స్పూన్లు ఓట్స్, ఒక స్పూన్ సత్తు పౌడర్, గుప్పెడు వేగించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు, ఒక స్పూన్ కోకో పౌడర్, రెండు స్పూన్ల బెల్లం వేసి మూత వేసి రెండు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే మంచి రుచిగా ఉండే ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్ షేక్ రెడీ.
jaggery Health benefits in telugu
ప్రోటీన్ షేక్ ని పిల్లల నుంచి పెద్దవారు వరకు అన్ని వయసుల వారు తాగవచ్చు. రోజు విడిచి రోజు తాగుతూ ఉంటే బరువు తగ్గడానికి మరియు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవటానికి సహాయపడుతుంది. అలాగే ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. నీరసం, అలసట, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు., ఆల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోటీన్ షేక్ తయారుచేసుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. కాస్త ఓపికగా శ్రద్దగా సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.