భోజనం చేసేటప్పుడు మంచి నీటిని ఎక్కువగా తాగితే ….ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…

Drink water between meals : మనం భోజనం చేసే విధానాన్ని బట్టి మన జీర్ణశక్తి ఆధారపడి ఉంటుంది. మనలో చాలా మంది భోజనం మధ్యలో నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలా తాగటం మంచిది కాదు. అయితే భోజనంలో మధ్యలో ఎక్కువగా నీటిని తాగకుండా మితంగా తాగవచ్చని నిపుణులు అంటున్నారు.
Food Hand benefits
భోజనం చేసే సమయంలో ఎక్కువగా నీటిని తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీటిని ఎక్కువగా తాగటం వలన కడుపులో జీర్ణశక్తి బలహీనపడి ఆహారం సరిగా జీర్ణం కాదు. మనం తినే ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన జీర్ణ రసాలు ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

కడుపులోని ఆమ్లం వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది. పొట్ట పెరిగే అవకాశం ఉంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల ఆహారంలో చక్కెర పరిమాణం అలానే ఉండిపోయి గ్లూకోజ్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది.
Diabetes diet in telugu
ఇది ప్రతి కణంలో కొవ్వు రూపంలో నిల్వ చేయబడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. భోజనం మధ్యలో ఎక్కువగా నీటిని తాగటం వలన బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు నీటిని ఎక్కువగా తాగకుండా ఉండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరంలో ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవక్రియ నిర్వహణకు సహాయపడుతుంది. అంతేకాకుండా భోజనం చేసే సమయంలో తరచుగా నీరు త్రాగే అలవాటును తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.