Healthhealth tips in telugu

నరాల బలహీనత,కీళ్ల నొప్పులు చిటికెలో మాయం…నడవలేని వారు సైతం పరిగెత్తేలా చేస్తుంది

Joint Pain Home Remedies In Telugu : ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం శరీరంలో గ్యాస్ పేరుకుపోవడం. శరీరంలో పేరుకుపోయిన గ్యాస్ బయటకు వెళ్లకపోతే ఎముకల మధ్యలో చేరి రకరకాల ఎముకల నొప్పులకు కారణం అవుతుంది.
Sonthi Health benefits In Telugu
ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే శరీరంలో అదనంగా ఉన్న గ్యాస్ బయటకు వెళ్ళిపోయి అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూను శొంఠి పొడి, అర టీ స్పూను వాము, ఒక బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
Ajwain Health Benefits In Telugu
ఈ నీటిని ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం తాగితే గ్యాస్ తగ్గి శరీరంలో నొప్పులు తగ్గుతాయి. డయాబెటిస్ లేని వారు ఈ నీటిలో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ డ్రింక్ తాగటం వలన ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ ఇలా అన్నీ రకాల సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
Biryani leaves health benefits In Telugu
అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి, జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Jaggery Health Benefits in Telugu
ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా కాస్త సమయాన్ని కేటాయించి ఇలాంటి డ్రింక్స్ తయారుచేసుకొని తాగితే ఎన్నో సమస్యల నుండి బయట పడి ఆరోగ్యంగా ఉండవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.