చాలా చవకగా అన్ని కాలాల్లోనూ విరివిగా లభించే ఈ ఆకులో ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Drumstick leaves Health Benefits: సాధారణంగా మున‌గ‌కాయ‌ల‌ను అందరు చారు,కూరగా చేసుకొని తింటూ ఉంటారు.మున‌గ‌కాయ‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. అయితే మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే
ప్రతి రోజు మునగాకును తింటారు.

మునగాకును పప్పుగా చేసుకోవచ్చు. అలాగే పొడిగా చేసుకొని తినవచ్చు. మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం,పాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి.మునగాకులో కాల్షియం పాలలో కన్నా 17 రేట్లు అధికంగా ఉంటుంది. మునగాకును ప్రతి రోజు తింటే ఎముకలు,దంతాలు బలంగా, దృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్ల పెరిగే పిల్లలకు మునగాకు చాలా మంచిది.
Hair Fall Tips
మునగాకులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నాన్ వెజ్ తినని వారికీ అవసరమైన ప్రోటీన్ ని మునగాకు అందిస్తుంది. దాంతో శరీరానికి పోషణ బాగా అందుతుంది. మునగాకులో పొటాషియం అరటిపండులో కంటే 15 రేట్లు అధికంగా ఉంటుంది. దీనితో రక్తసరఫరా మెరుగుపడి రక్తపోటు తగ్గుతుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
Diabetes In Telugu
ప్రతి రోజు 7 గ్రాముల మునగాకు పొడిని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి. మునగాకులో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మునగాకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

మునగాకులో అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన దృష్టి మాంద్యం, రేచీకటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అన్నీ కాలాల్లోనూ చాలా విరివిగా లభించే మునగాకును తీసుకుంటే ఎన్నో సమస్యల నుండి బయట పడి ఆరోగ్యంగా ఉండవచ్చు. మునగాకుతో పొడి తయారుచేసుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.