Healthhealth tips in telugu

రోజుకి 3 తింటే చాలు చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది

Best Dry Fruits Heart Health : మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె ఆరోగ్యంగా ఉండేలా మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ లేకుండా రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసే కొన్ని Dry Fruits గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా Dry Fruits వాడకం కూడా పెరిగింది.
Diabetes patients eat almonds In Telugu
రోజుకి 3 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి. కరిగే ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Is pista good for diabetes In Telugu
రోజుకి 3 పిస్తా పప్పులను తింటే మంచిది. బాదం పప్పుతో పోలిస్తే పిస్తా పప్పులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. పిస్తాపప్పులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడటమే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
Wal Nuts Benefits In telugu
వాల్ నట్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడుతుంది. వాల్ నట్స్ లో అమినో యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి రోజూ రెండు వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ప్రతి రోజు ఈ మూడు Dry Fruits ని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అధిక బరువు,డయాబెటిస్ వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. Dry Fruits ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంటున్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.