టమోటాను ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు తింటే…ఏమి అవుతుందో…?

Tomato Side Effects In telugu : టమోటాలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నవారు టమోటాను ఎక్కువగా తీసుకోకూడదు. టమోటాను వంటలలో వేస్తే మంచి రుచి వస్తుంది. అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నవారు టమోటాకు దూరంగా ఉండాలో చూద్దాం.
Acidity home remedies
టమోటా ఆమ్ల గుణం కలిగి ఉండుట వలన టమోటా తిన్నప్పుడు అధిక గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దాని కారణంగా గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు టమోటా చాలా తక్కువగా తినాలి. అలాగే టమోటాలో హిస్టామిన్ అనే సమ్మేళనం ఉండుట వలన చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీ వచ్చే అవకాశం ఉంది.
kidney problems
అందువల్ల అలెర్జీ ఉన్నవారు టమోటా తింటే నోరు, నాలుక మరియు ముఖం వాపు, తుమ్ములు, గొంతు ఇన్ఫెక్షన్,చర్మంపై తీవ్రమైన దురద మరియు వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టమోటాలో పొటాషియం మరియు ఆక్సలేట్‌ ఎక్కువగా ఉండుట వలన కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళ సమస్య వస్తుంది.
Joint pains in telugu
కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా టమోటాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే టమోటాలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్‌ ఉంటుంది. సోలనైన్ అనేది కణజాలంలో కాల్షియం పేరుకుపోవడానికి కారణం అవుతుంది. దాంతో టమోటా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు మరియు కండరాల నొప్పులు,వాపులు వచ్చే ప్రమాదం ఉంది.
tomato benefits in telugu
కాబట్టి అవసరమైతే టమోటాను చాలా తక్కువగా తీసుకోవాలి….లేదంటే టమోటాకి దూరంగా ఉండటమే మంచిది. టమోటాలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.