ప్రతి రోజు అర స్పూన్ బొప్పాయి గింజలను తింటే ఏమి అవుతుందో తెలుసా?
Benefits of papaya seeds in Telugu : బొప్పాయిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషకాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. సాధారణంగా మనలో చాలా మంది బొప్పాయిని తిని బొప్పాయి గింజలు పాడేస్తూ ఉంటారు. బొప్పాయి గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి.
కానీ వాటి గురించి మనలో చాలా మందికి తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే బొప్పాయి కంటే బొప్పాయి గింజలు లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోజుకి 10 నుంచి 15 బొప్పాయి గింజలను పొడిగా చేసి సలాడ్లు లేదా కూరలలో జల్లుకొని తినవచ్చు.
కిడ్నీ వ్యాధులను నయం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరచి బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు,మంట, నొప్పి వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి బాగా సహాయ. పడుతుంది.
అధిక బరువు ఉన్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ లో సగం బొప్పాయి గింజల పొడి, ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఉదయం సమయంలో తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే జీర్ణశక్తి కూడా బాగా మెరుగు అయ్యి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ వంటి సమస్యలు రావు.
బొప్పాయి గింజలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలో ఉండే హానికారక బ్యాక్టీరియాను బయటకు పంపటమే కాకుండా శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఒక స్పూన్ తేనెలో పావు స్పూన్ లో సగం బొప్పాయి గింజల పొడి కలిపి తీసుకోవచ్చు. ఈ గింజలను సరైన మోతాదులోనే తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.