Healthhealth tips in telugu

1 గ్లాస్ 15 రోజులు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది

Carrot Weight Loss Tips : ఈ మధ్యకాలంలో అధిక బరువు అనేది చాలా ఎక్కువగా కనబడుతోంది. .వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవనశైలి., వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు టీవీ, ఫోన్ అంటూ కూర్చుని ఉండటం, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఇప్పుడు ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ లో ఉపయోగించే క్యారెట్లలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ లో విటమిన్ ఏ., విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
peanut butter Benefits In telugu
తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను అందించే క్యారెట్ ని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఇప్పుడు అధిక బరువు నుండి బయటపడడానికి క్యారెట్ తో డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలను నీటిని పోసి ఉడికించాలి. .
Dates Health benefits
ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, గింజలు తీసిన మూడు ఖర్జూరాలు, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ పీనట్ బట్టర్, అరస్పూన్ దాల్చిన చెక్క పొడి, కొంచెం నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టి ఒక గ్లాసు పాలు పోసి కాస్త వేడెక్కాక అందులో మిక్సీ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. .
Dalchina chekka for weight loss
ఈ పాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి గంట ముందు లేదా రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా 15 రోజులు పాటు తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలంటే శరీరం లో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి బానపట్ట ఫ్లాట్ గా మారటమే కాకుండా అధిక బరువు కూడా తగ్గుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.