Healthhealth tips in telugu

ఆరోగ్యానికి మంచిదని నెయ్యి ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Ghee Side Effects : మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భారతీయ ఆహారం మరియు సంస్కృతిలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. నెయ్యిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు విటమిన్ కె వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి…కొన్ని సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. అజీర్ణం, అల్సర్లు,పొత్తికడుపులో నొప్పి వంటి పొట్టకు సంబందించిన సమస్యలు ఉన్నవారు నెయ్యి తినటం మంచిది కాదు. సిర్రోసిస్ కాలేయ వ్యాధి కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది.
ఈ వ్యాధిలో ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం దెబ్బతిన్న కణజాలంతో భర్తీ చేయబడుతుంది.

ఫలితంగా కాలేయం శాశ్వతంగా దెబ్బతింటుంది. ఈ వ్యాధితో బాధపడేవారు నెయ్యి తినకూడదు. అంతేకాకుండా ప్లీహము పెద్దగా ఉన్నా నెయ్యి తినకూడదు. జ్వరం వచ్చినప్పుడు నెయ్యి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే జ్వరాలలో నెయ్యి శరీరంలో జీర్ణక్రియను నెమ్మది చేసి కఫం పేరుకుపోయేలా చేస్తుంది.

కాబట్టి జ్వరం, జలుబు మరియు ఫ్లూ ఉన్న సమయంలో వీలైనంత వరకు నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. నెయ్యి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు మరియు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు నెయ్యిని తినకూడదు.
బరువు తగ్గాలనుకునే వారు .కూడా నెయ్యిని తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
liver
హెపటైటిస్ అనేది ఒక ప్రమాదకరమైన కాలేయ వ్యాధి. ఈ సమస్య ఉన్నవారు తమ ఆహారంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం.
హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పుడు కాలేయం వాపు కారణంగా కాలేయం జీర్ణక్రియలో నిదానిస్తుంది. కాబట్టి నెయ్యి తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.