Healthhealth tips in telugu

హైబీపీ ఉన్నవారు అరటి పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Bananas For High Blood Pressure : రక్తపోటు ఉన్నవారు ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే రక్తపోటు సమస్య వచ్చేస్తుంది. కొన్ని ఆహారాలను తీసుకుంటే నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా నైట్రేట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్ గా మారి శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది.కాబట్టి రక్తపోటు సమస్య రాగానే డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఆరతి పండును రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హైబీపీని నియంత్రించటంలో అరటి పండు మంచి ఔషదంలా పనిచేస్తుంది.
Banana,Peel
వీటిలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుది. ఒక మీడియం సైజు అరటి పండులో ఉండే పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు ,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలోని అదనపు సోడియం (ఉప్పు) రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చి నీటి సమతుల్యతను దెబ్బతీస్తుంది.

అలాంటి సమయంలో పొటాషియం సమృద్దిగా ఉన్న అరటి పండు వంటి ఆహారాలను తీసుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుంది ,శరీరంలోని అదనపు ఉప్పు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. పొటాషియం శరీరంలో ద్రవం,ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి , రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి కూడా సహాయపడుతుంది.
Eating bananas during monsoon is good or bad
రక్తపోటు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక అరటి పండు తింటే సరిపోతుంది. అరటి పండ్లను ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరటి పండును ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.