Healthhealth tips in telugu

1 గ్లాసు పిల్లల మెదడును చురుగ్గా ఉండేలా చేసి జ్ఞాప‌క శ‌క్తి, ఆలోచ‌న శ‌క్తిని రెట్టింపు చేస్తుంది

Apple cucumber and carrot juice benefits : పిల్లల ఎదుగుదలకు ఎన్ని పోషకాలను అందిస్తామో…అలాగే పిల్లల మెదడును చురుగ్గా ఉంచే ఆహారాలను ఇవ్వటానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లల మెదడు చురుకుగా ఉంటే జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా అన్నింటిలోనూ బాగా రాణిస్తారు.
apple
అందువల్ల పిల్లల మెదడు చురుగ్గా ఉండటానికి కొన్ని ఆహారాలను వారి డైట్ లో తప్పనిసరిగా చేర్చాలి. పిల్లల మెదడు చురుగ్గా ఉండటానికి ఒక జ్యూస్ తయారు చేసుకుందాం. ఈ జ్యూస్ కోసం ఒక క్యారెట్, ఒక కీరదోసకాయ, ఒక యాపిల్ శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

క్యారెట్ ముక్కలను మాత్రం ఉడికించాలి. మిక్సీ జార్ లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు, యాపిల్ ముక్కలు, పది నుంచి 12 పుదీనా ఆకులు,చిన్న అల్లం ముక్క, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రుచికి సరిపడా తేనెను కలపాలి. ఈ జ్యూస్ ను బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గంట ముందు పిల్లలకు ఇవ్వాలి.
keera dosakaya benefits in telugu
ఈ విధంగా వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ ఇస్తూ ఉంటే వీటిలో ఉన్న పోషకాలు పిల్లల మెదడును చురుగ్గా చేసి జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తిని రెట్టింపు చేస్తాయి. అలాగే కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
Honey benefits in telugu
ఈ జ్యూస్ ని ఉదయం సమయంలో తాగటం వలన అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. రక్తహీనత సమస్య ఉన్న వారిలో రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి మరియు రక్తకణాల పెరుగుదలకు సహాయపడి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.