ఈ పొడిని ఇలా తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Phool makhana Weight Loss Tips In Telugu : ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దగా ఫలితాలు ఇవ్వక చాలా మంది నిరాశకు గురి అవుతూ ఉంటారు.
మార్కెట్లో దొరికే కొన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా వాడి అలసిపోయి ఉంటారు. బరువు తగ్గటానికి మన ఇంటిలో సహజ సిద్ధంగా ఒక పొడి తయారు చేసుకుని వాడితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పొడి బరువును తగ్గించడానికి కాకుండా మన ఆరోగ్యానికి. కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు కప్పుల ఫూల్ మఖానా వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత 20 బాదం పప్పులను డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత నాలుగు స్పూన్ల అవిసె గింజలను కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత అర కప్పు కొబ్బరి ముక్కలను కూడా ట్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాస్త చల్లరానివ్వాలి.
మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న ఫూల్ మఖానా, బాదంపప్పు, అవిసె గింజలు, ఎండు కొబ్బరి ముక్కలు, రెండు స్పూన్ల బెల్లం పొడి వేసి మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఫ్రిజ్ లో నిలువ చేస్తే మూడు వారాల వరకు నిల్వ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో ఒక స్పూన్ పొడి కలిపి తీసుకోవాలి. .
ఈ విధంగా తీసుకుంటూ ఉంటే 15 రోజుల్లోనే మీకు తేడా ఖచ్చితంగా కనబడుతుంది. శరీరంలో జీవక్రియ రేటును పెంచి అదనంగా ఉన్న కొవ్వును కరిగించి వేగంగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఏమి ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/